- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్
ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు రెక్కీ నిర్వహించిన నలుగురు నిందితుల అరెస్ట్.. విదేశీ పిస్టల్స్ స్వాధీనం.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ముగ్గురు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరొకరిని ఢిల్లీ నివాసి గా గుర్తించారు. నిందితులు దేశ రాజధానిలోని పలు కీలక పోలీస్ స్టేషన్లు, అత్యధిక రద్దీ ఉండే ప్రార్థనా స్థలాల (మతపరమైన ప్రాంతాలు) వద్ద ఇప్పటికే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. పండుగల సీజన్ లక్ష్యంగా నగరంలో పెద్ద ఎత్తున దాడులు, పేలుళ్లకు వీరు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అరెస్ట్ చేసిన నిందితుల నుంచి రెండు అత్యాధునిక విదేశీ పిస్టల్స్, 9 లైవ్ బులెట్స్ (Bullets), 5 మొబైల్ ఫోన్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సరిహద్దుల అవతల ఉన్న ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని, పంజాబ్ సరిహద్దుల గుండా డ్రోన్లను (Drones) ఉపయోగించి ఆయుధాలను, భారీగా మాదకద్రవ్యాలను (Drugs) దేశంలోకి రప్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ విక్రయించగా వచ్చిన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు (Terror Funding) వాడుతున్నట్లు తేలింది. ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం ఢిల్లీ, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.






