డోన్ హైవేపై దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు

by Naga Rani Yarlagadda |

నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు.

డోన్ హైవేపై దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. పందుల లోడ్ తో వెళ్తున్న వాహనాన్ని గుర్తించి ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దుండగులు ఎదురు తిరిగారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. పందుల వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా.. పోలీసులపై, వాహనంపై రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరారవ్వగా.. ప్యాపిలి వద్ద అడ్డుకునేందుకు మరోసారి ట్రై చేశారు. అక్కడి నుంచి కూడా దొంగలు తప్పించుకుని పారిపోయారు.

Next Story