- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం.. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఆమె అకాల మరణం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా స్వేచ్ఛ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న ఓ కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్ (Shankar), శ్రీదేవి (Sridevi) కలిసి చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. కన్న బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story






