- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోళ్లు..రైతులకు సర్కార్ అదిరిపోయే శుభవార్త !
ధాన్యం కొనుగోలు సమయంలో తాలు పేరుతో కోత విధిస్తే చర్యలు కఠిన చర్యలు ఉంటాయని కేంద్రాల నిర్వహకులను ఉత్తమ్ హెచ్చరించారు.

తాలు పేరుతో ధాన్యంలో కోత విధిస్తే కఠిన చర్యలు
కేంద్రాల్లో చనిపోయి రైతులకు తక్షణమే పరిహారం అందిస్తాం
వర్షాలకు ధాన్యం తడవకుండా 2.63 లక్షల టార్పాలిన్లు ఉంచాం
ఈసీజన్లో 17.28 లక్షల మెట్రిక్ధాన్యం సేకరణ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు సమయంలో తాలు పేరుతో కోత విధిస్తే చర్యలు కఠిన చర్యలు ఉంటాయని కేంద్రాల నిర్వహకులను రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇది రైతు ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధించదన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు చనిపోతే తక్షణమే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముందెన్నడూ లేని రీతిలో వసతులు కల్పించామని, అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడివకుండా 2.63 లక్షల టార్బాలిన్స్ ఏర్పాటు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రైతులను అయోమయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, ఈ రబీ సీజన్ లో 67 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే 141 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ధాన్యం 17.28 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి రైతుల ఖాతాల్లో రూ.2310 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 18.75 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచామని, 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని, అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల గుర్తించినట్లు వెల్లడించారు.
కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు వాహనాలు సిద్దం :
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు 6,200 వాహనాలు అందుబాటులో ఉంచామని, కేంద్రాలలో రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా మంచినీటి సరఫరా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని కేంద్రాలలో ఉదయం, సాయంత్రం పూట కొనుగోలు చేపట్టాలని నిర్వహకులకు ఆదేశాలిచ్చారు.అకాల వర్షాలు సంభవిస్తే రైతులు,సిబ్బంది చెట్లు కింద ,కరెంట్ స్తంభాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ ఉంటుందని, ప్రత్యేకించి పౌర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశామన్నారు.
కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024-25 ఖరీఫ్ లో 8332 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2023-24 బి.ఆర్.యస్ హయాంలో ఖరీఫ్ లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పాలనలో 2024-25 ఖరీఫ్ లో 53.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ 8448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 11లక్షల 65వేల మంది రైతుల నుండి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17160 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. ప్రస్తుత రబీలో 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13లక్షల మంది రైతుల నుండి రికార్డ్ స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 21,501 కోట్లు రైతులకు చెల్లించెందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు.






