- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka Emotional: నా జన్మ ధన్యమైంది.. భావోద్వేగానికి గురైన మంత్రి సీతక్క
మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో : మేడారం (Medaram) అభివృద్ధి ప్రణాళిక పై సీఎం రేవంత్ నిర్వహించిన సమావేశంలో (Minister Seethakka) మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలను సందర్శించారు. ఆలయ అభివృద్ధిపై ఆయన అధికారులు, పూజారులు, ఆదివాసి పెద్దలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా అమ్మవార్ల ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు సీఎంకు వేల వందనాలు తెలిపారు. వనదేవతల గుడిని అభివృద్ధి చేసుకునే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యం అయింది మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. మేడారం అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదని, ఆదివాసి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని హర్షం వ్యక్తం చేశారు.
సమ్మక్క సారలమ్మ తల్లుల త్యాగాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళిక ను సీఎం ఖరారు చేశారు ఈ రోజు నా జన్మ ధన్యమైన రోజు.. అధికార హోదాలో మేడారం జాతరను నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆ తల్లులకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ తల్లుల దీవెనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తనకు మంత్రిగా సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. వెయ్యేండ్ల పాటు మేడారం కీర్తి నిలిచిపోయేలా అభివృద్ధి చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలనుకున్నా.. కానీ నేను అడగకముందే సీఎం స్వయంగా ముందుకు వచ్చి మేడారం గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పారని అన్నారు. అడగగానే అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారని, ఇంతకంటే గొప్ప అవకాశం, అదృష్టం మరొకటి ఉండదన్నారు. సమ్మక్క సారలమ్మ గుడి బాగుంటే ప్రజలంతా బాగుంటారని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఇక్కడి ప్రజలంతా సహకరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.






