Mahesh kumar Goud : భూములను లాక్కోవడం లేదు : టీపీసీసీ చీఫ్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది.

Mahesh kumar Goud : భూములను లాక్కోవడం లేదు : టీపీసీసీ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది. ఎన్నో జీవరాశులకు నివాసస్థలమైన వర్శిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని వర్శిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా ఈ వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) స్పందించారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వం హెచ్సీయూ భూములను లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. ఆ భూములకు బదులుగా ఎప్పుడో వేరేచోట భూములు కేటాయించామని పేర్కొన్నారు.

ఆ భూమి ఇప్పటి వరకు కోర్టు కేసులో ఉన్నందున ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని.. కోర్టు కేసులో ప్రభుత్వం గెలిచినందున.. వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్సీయూ భూములను ప్రభుత్వం తమదేనని స్వాధీనం చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. గతంలో ఈ భూములకుబదులుగా వేరే చోట వర్శిటీకి భూమి కేటాయించామని.. అయితే ఆ భూమి విషయంపై కోర్టులో కేసు ఉండటంతో ఇన్నాళ్ళు దానిని స్వాధీనం చేసుకోవడం కుదరలేదని ప్రభుత్వం చెబుతోంది.

Next Story