సీఎం రేవంత్‌తో కొత్తగా గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి భేటీ.. ఎందుకంటే?

by Ramesh Naini |   (  Updated:2025-03-06 07:22:20  IST  )

ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.

సీఎం రేవంత్‌తో కొత్తగా గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి భేటీ.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి (MLC Sripal Reddy) గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఎన్నికలో విజయం సాధించిన శ్రీపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పుష్పగుచ్ఛం అందజేసి విషెస్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి సీఎంకు స్పష్టం చేశారు.

కాగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటీవల మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరు గెలుపు కోటను చేరుకోలేకపోయారు. దీంతో రెండో ప్రాదాన్యత ఓట్ల లెక్కింపులో 13,969 ఓట్లతో పీఆర్‌టీయూ టీఎస్‌ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇక, అధికార పార్టీ కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి, సీఎం రేవంత్‌ రెడ్డి సన్నిహితుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.

Next Story