- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఆత్మహత్యకేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: మూడు నెలల క్రితం తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసు కొత్తమలుపు తిరిగింది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. భార్య విజయారెడ్డి తరపు కుటుంబంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని మేడిపల్లి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సురేందర్.. తన భార్య ఆత్మహత్యకు ఆమె అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలతనే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. భార్య, బిడ్డలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం తనన పలుమార్లు బెదిరించారని వాపోయారు. తానెప్పుడు చనిపోతానా, ఆస్తి ఎప్పుడు తీసుకుందామా అని ఎదురుచూస్తున్నారని వాపోయారు. వారు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని, వారి మరణాలపై తనకు అనుమానాలున్నాయన్నారు. తన తదనంతరం ఉన్న ఆస్తులన్నింటినీ ట్రస్టుకు రాసిస్తానని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. విజయారెడ్డి చనిపోయేముందు ఆమె కారులో పార్కింగ్ టికెట్ పై.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసిన విషయం తెలిపింది.






