నవవధువు అనుమానాస్పద మృతికేసులో కొత్తమలుపు

by Naga Rani Yarlagadda |

గుజరాత్‌లోని గ్వాలియర్ కు చెందిన ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ పలక్ రజక్ అనే నవవధువు అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.

నవవధువు అనుమానాస్పద మృతికేసులో కొత్తమలుపు
X

దిశ, వెబ్‌‌డెస్క్: గుజరాత్ లోని గ్వాలియర్ కు చెందిన ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ పలక్ రజక్ అనే నవవధువు అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది. పలక్ మరణానికి వరకట్న వేధింపులే కారణమని ఆమె పుట్టింటివాళ్లు చేస్తున్న ఆరోపణలను అత్తింటివారు తీవ్రంగా ఖండించారు. పలక్ కు పెళ్లికి ముందు, తర్వాత కూడా పలువురితో సంబంధాలున్నాయని, ఆమెకు మద్యం, గంజాయి తాగే అలవాటు కూడా ఉందని ఆరోపించారు. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వాదించారు. ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

పలక్ అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటికే ఆమె భర్త అమిత్ రజక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో తన భార్యకు అనేక అఫైర్లు ఉన్నాయని, నిజాలు తెలియాలంటే ఆమె ఫోన్ ను పూర్తిగా చెక్ చెక్ చేయాలని కోరాడు. గతంలో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినపుడు ఆమె తండ్రికి సమాచారమిచ్చానని, తనను, తన కుటుంబాన్నీ కావాలనే ఈ కేసులో ఇరికించారని అమిత్ వాపోయాడు. పలక్ ఆడపడుచులు కూడా ఈ ఆరోపణలను బలపరిచారు. గుర్తుతెలియని వ్యక్తులతో తరచూ తిరిగేదని, కొన్ని అసభ్యకర వీడియోలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.

వివాహమైన కొద్ది రోజులకే పలక్‌ను కారు కావాలంటూ అత్తగారింటి వారు వేధింపులకు గురిచేశారని, భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పలక్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఈ ఎదురు ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతానికి చెందిన పలక్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఈ ఏడాది మే 12న ఆమె తన అత్తగారింట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. పలక్ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఆమె భర్త అమిత్, అత్త మీరా, బావ ఆకాష్‌లపై కట్నపు వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం (Suicide Abetment) వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నగరం పర్యవేక్షక అధికారి (CSP) అతుల్ సోని ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, భర్త అమిత్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పలక్ మరణం కట్నపు వేధింపుల వల్లే జరిగిందా లేదా అత్తగారింటి వారు చేస్తున్న ఆరోపణల్లో నిజముందా అనే కోణాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా తేల్చలేదు.

Next Story