జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌కు మళ్లీ గుర్తుల టెన్షన్‌!

by Prasad Jukanti |   (  Updated:2025-10-26 06:26:39  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థులకు ఈసీ ఎన్నికల గుర్తులను కేటాయించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌కు మళ్లీ గుర్తుల టెన్షన్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల విత్ డ్రా ముగియడం, బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నట్లు సంఖ్య తేలడంతో అభ్యర్థులకు ఈసీ తాజాగా ఎన్నికల సింబల్ కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా క్యాంపెయినింగ్‍ను పరుగులు పెట్టించే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‍కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ (Jubilee Hills by-election) గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు. తాజాగా అభ్యర్థులకు ఈసీ ప్రకటించిన ఎన్నికల సింబల్స్ లో (Election Commission symbols) బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును (BRS car symbol) పోలిన సింబల్స్ మిగతా అభ్యర్థులకు కేటాయించడం బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టించే అంశంగా మారింది.

మళ్లీ అవే గుర్తులు:

తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన గుర్తులు ఇతర అభ్యర్థులకు కేటాయించడం ద్వారా ఓటర్లు తికమక పడుతున్నారని, దీంతో ఓట్లు గల్లంతవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో రోడ్డు రోలర్ (Road roller symbol), చపాతీ మేకర్ (chapati maker symbol), సోప్ బాక్స్, ట్రాక్టర్, ఆటోరిక్షా, టీవీ, కుట్టుమిషన్, షిప్, డోలీ, కెమెరాతో (camera symbol) సహా మరికొన్ని గుర్తులు కారు గుర్తుకు సమానంగా ఉన్నాయని వీటిని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గతంలో విజ్ఞుప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధ ఓటర్లు, దృష్టిలోపం ఉన్న ఓటర్లు ఈ గుర్తుపై తికమక పడి చివరకు ఓటు వేస్తున్నారన్నారని పేర్కొంది. వాస్తవానికి గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి సిబంల్స్ బీఆర్ఎస్ గెలుపును తారుమారు చేసిన చరిత్ర ఉంది. ఈక్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాజాగా ఈసీ కేటాయించిన గుర్తుల్లో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, వంటి సింబల్స్ ఉండటంతో ఈసారి ఏం జరగబోతోందని అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

3 నంబర్ కారు.. 9వ నంబర్ చపాతీ రోలర్:

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం ఈసీ కేటాయించిన బ్యాలెట్ పేపర్‍లో మొదటి స్థానంలో జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి (కమలం), రెండో స్థానంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (చేయి), మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ (కారు) గుర్తులు కేటాయించారు. ఇక 5వ నంబర్ లో తెలుగు రాజాధికార సమితీ పార్టీ అభ్యర్థికి సోప్ డిష్, 9వ నంబర్‍లో అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ రోలర్, 13న నంబర్‍లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి రోడ్డు రోలర్, 21వ నంబర్‍లో ప్రజావెలుగు పార్టీ అభ్యర్థికి కెమెరా, 28వ నంబర్‍లో ఆల్ ఇండియా మజ్జిత్ ఈ- ఇన్ క్విలాబ్ ఈ మిలాత్ అభ్యర్థికి షిప్, 54వ నంబర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి టీవీ వంటి గుర్తులు కేటాయించారు. అయితే సాధారణంగా పోలింగ్ కేంద్రంలో ఒక బ్యాలెట్ యూనిట్‍పై నోటా సహా 16 మంది పేర్లు, గుర్తు, ఫోటో ఉంటాయి. అంటే ఫస్ట్ ఈవీఎంలోనే బీఆర్ఎస్ తో సింబర్ కారుతో పాటు 5వ నంబర్ లో సోప్ డిష్, 9వ నంబర్ లో చపాతీ రోలర్, 13వ నంబర్ రోడ్డు రోలర్ సింబర్స్ ఉండనున్నాయి. తప్పక గెలవాలని భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ గుర్తుల గండం ఎలా దాటుతుందో చూడాలి మరి.

Next Story