- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్.. అదును చూసి వారిని రెచ్చగొడుతున్న బీఆర్ఎస్!
పంచాయతీ కార్యదర్శుల బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ కార్యదర్శుల బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, లేకపోతే బాధిత కార్యదర్శులు బీఆర్ఎస్ వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. బిల్లుల విడుదల కోసం ఆందోళనలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను బీఆర్ఎస్ లీడర్లు ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మె చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈలోపు సెక్రెటరీల బిల్లులు క్లియర్ చేయాలని లేనియెడల గ్రామాల్లో పారిశుధ్య పనులకు బ్రేకులు పడొచ్చని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలకు కార్యదర్శులే దిక్కు..
సర్పంచుల పదవీ కాలం ముగియడంతో 2 ఫిబ్రవరి 2024 నుంచి పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. గ్రామంలోని అవసరాలను వారే పర్యవేక్షిస్తున్నారు. సొంత డబ్బులతో పారిశుధ్యం, బ్లీచింగ్, విద్యుత్ బల్బులను కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. కానీ రెగ్యులర్‌గా విడుదల చేయకపోవడంతో కార్యదర్శులే తమ జీతాలను చెల్లించి గ్రామాల అవసరాలను తీర్చుతున్నారు. సగటున ఒక్కో సెక్రెటరీ రూ.4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.90 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లిస్తే మినహా గ్రామాల అవసరాలు తీర్చలేమని స్థానిక ఎమ్మెల్యేలపై కార్యదర్శులు ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులకు వివరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్
పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో గుర్రుగా ఉన్న సెక్రెటరీలను ఆందోళనలు చేసేలా బీఆర్ఎస్ లీడర్లు ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ రాజకీయ కుట్రను మంత్రులకు వివరించి బిల్లులు రిలీజ్ చేయించాలని కోరుతున్నారు. ఒకవేళ పంచాయతీ సెక్రెటరీలు ఆందోళనకు దిగితే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు బ్రేక్ పడే చాన్స్ ఉంటుంది. ఇది పరోక్షంగా స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






