Meenakshi Natarajan : ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రాక !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-26 09:25:42  IST  )

లంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)ఎల్లుండి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీన గాంధీభవన్ లో పీసీసీ చీఫ్(PCC Chief) బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అధ్యక్షతన జరుగనున్న టీపీసీసీ విస్త్రృత స్థాయి సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు.

Meenakshi Natarajan : ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి రాక !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)ఎల్లుండి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీన గాంధీభవన్ లో పీసీసీ చీఫ్(PCC Chief) బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అధ్యక్షతన జరుగనున్న టీపీసీసీ విస్త్రృత స్థాయి సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. దీపాదాస్ మున్షి స్థానంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా నియామితులైన పిదప మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పార్టీ వర్గాలు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి.

అయితే మీనాక్షి నటరాజన్ రాక సందర్భంగా ఎలాంటి స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాలు చేయవద్ధని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టం చేశారు. బోకెలు, శాలువలు కూడా తీసుకరావద్ధంటూ ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో రేపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి, నల్లగొండ,వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగియ్యనుంది. అలాగే మార్చి 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇది ఇలా ఉండగానే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుండగా... మార్చి 20న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఉండనున్నాయి.

అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య బలం ఆధారంగా... ఎమ్మెల్యే కోటా కింద ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాలను సులభంగా గెలుచుకోగలదు. మరో అదనపు సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోని చేరిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది. అటు ఎంఐఎం, సీపీఐ‌లు కూడా ఒక సీటును ఆశిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ ఒక్క సీటు కాంగ్రెస్‌ను అడుగుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే కోటా సీట్ల కింద ఎమ్మెల్సీ ఎన్నికల ఫార్ములా ప్రకారం... ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్‌కు 66(కాంగ్రెస్ 65 + సీపీఐ 1) మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ మూడు స్థానాలు సులువుగా 3 స్థానాలను గెలుచుకోగలదు. ఎమ్మెల్యే కోటాలోని నాల్గవ ఎమ్మెల్సీ స్థానంపై 28న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అలాగే అభ్యర్థుల ఖరారుపై కూడా చర్చించనున్నారని సమాచారం. వాటితో పాటు కులగణన, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కమిటీ ఏర్పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలను కూడా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారని పార్టీ వర్గాల కథనం.

Next Story