Telangana Rising: తెలంగాణ రైజింగ్‍పై సరికొత్త పాట

by Prasad Jukanti |

తెలంగాణ రైజింగ్ పై సరికొత్త పాట ఆకట్టుకుంటోంది.

Telangana Rising: తెలంగాణ రైజింగ్‍పై సరికొత్త పాట
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అనుకూలతలను మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వివిధ అంశాలపై ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్‍ థీమ్‍పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు. ఇవాళ గ్లోబల్ సమ్మింట్ వేదికగా ఈ పాటను ప్రదర్శించారు. 'తెలంగాణ రైజింగ్..స్టేట్ ఈజ్ సో షైనింగ్.. ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్..' అంటూ సాగే ఈ పాటలో తెలంగాణ టూరిజం, పరిశ్రలు, భారత్ ఫ్యూచర్ సిటీ, గేట్ వే ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంశాలను పొందుపరిచారు. తెలంగాణలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని వచ్చి పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. ప్రతాప్ రానా రచించిన ఈ థీమ్ సాంగ్ ను రచించి దర్శకత్వం వహించారు. తెలంగాణ రైజింగ్ థీమ్ సాంగ్

Next Story