- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది దశకు కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన : రైతు కమిషన్ చైర్మన్
రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని విత్తన చట్టం ముసాయిదా రూపొందించామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఒక్కో సమస్యను పరిష్కారం చేస్తున్నామని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని విత్తన చట్టం ముసాయిదా రూపొందించామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఒక్కో సమస్యను పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. సోమవారం రైతు కమిషన్ కార్యాలయంలో విత్తన చట్ట ముసాయిదాపై కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విత్తన చట్ట ముసాయిదాపై చర్చించారు. అనంతరం సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ, కమిషన్ చొరవ తీసుకొని దాదాపు రూ. 4 కోట్ల పరిహారం అందించేలా చేశామని, మిర్చి, పత్తి, వరి లాంటి విత్తనాలను అమ్మకాలు చేసే సమయంలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలను అన్నిటికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా కమిటీ వేసిందని, రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని పెండింగ్ లో ఉంచాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొస్తున్న ముసాయిదా చట్టం తుది దశకు చేరింది.
ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి వద్ద కూడా సమావేశం జరిగిందని, కమిషన్ ఆధ్వర్యంలో చట్టంపై మరోసారి సమావేశం కావాలని మంత్రి చెప్పడంతో మరోసారి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముసాయిదా తెచ్చిందని, ఇది పూర్తిగా విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉండటంతో దీనిపై చర్చలు జరిపి తుది ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు.దేశంలో విత్తనాలు, రసాయన ఎరువులు అన్ని మల్టీ నేషనల్ కంపెనీలకే అనుకూలంగా ఉన్నాయని, గతంలో చాలా అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే కానీ గత ప్రభుత్వం కంపెనీలకు అధికారాలు కట్టబెట్టిందని ఆరోపించారు.ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్, అగ్రికల్చర్ డైరెక్టర్ బి.గోపి, కమిటీ సభ్యులు దొంతి నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివప్రసాద్, మెంబర్ సెక్రెటరీ గోపాల్, అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి వెంకట ప్రసాద్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.






