- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: రేపే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ.. ఏ టైమ్‌కు ఇస్తారో తెలుసా?
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ, ఇందిరమ్మ ఇళ్ల(indiramma illu) పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా(Rythu Bharosa) పథకాలు రేపు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ, ఇందిరమ్మ ఇళ్ల(indiramma illu) పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా(Rythu Bharosa) పథకాలు రేపు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పథకాలు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మరోసారి ప్రకటించారు. రేపు రాని వాళ్లు ఎవరూ ఆందోళన చెందవద్దని.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎప్పుడైనా పొందవచ్చు అని తెలిపారు. రేషన్ కార్డు మీద మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు.
గ్రామసభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే అదే సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షం సూచనలు, సలహాలు ఇవ్వకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు.






