కొత్త రేషన్ కార్డుదారులకు తప్పని తిప్పలు.. నేటికీ అందని బియ్యం

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్​కార్డులు మంజూరు చేసినా వారు సన్నబియ్యం పంపిణీకి నోచుకోలేదు.

కొత్త రేషన్ కార్డుదారులకు తప్పని తిప్పలు.. నేటికీ అందని బియ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్​కార్డులు మంజూరు చేసినా వారు సన్నబియ్యం పంపిణీకి నోచుకోలేదు. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 2.55 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసింది. ఇందులో మే 20వ తేదీ తరువాత మంజూరైన వారు కొత్తకార్డు వచ్చిందని మురిసిపోవడం తప్ప మూడు నెలల రేషన్​బియ్యం అందలేదు. దీంతో సుమారు 1.10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కాలేదని తెలిసింది. చివరి దిశలో వచ్చిన వారి పేర్లు డీలర్లకు చేరలేదు. దీంతో వారంతా మూడు నెలల బియ్యానికి రేషన్​దుకాణాల వద్ద పడిగాపులు పడితే చివరికి పేర్లు ఆన్‌లైన్​చూపించడం లేదని డీలర్లు వెనకి పంపారు. వీరు సెప్టెంబర్​వరకు వేచి చూడక తప్పదు.

ఎన్స్‌ఫోర్స్‌మెంట్ దాడులు

మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపి ణీపై పౌరసరఫరాల శాఖకొత్త కార్డుదారులకు తప్పని తిప్పలు.. నేటికీ అందని బియ్యం రేషన్​దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి వరం గల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు దుకాణాలకు వెళ్లి రికార్డులు, బియ్యం స్టాక్ పరిశీలించడంతోపాటు ఐదు నెలలుగా సన్నబియ్యం తీసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీల్లో బియ్యం అక్రమాలకు పాల్పడిన ఐదు గురు డీలర్లపై కేసులు నమోదయ్యాయి. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ముం దుగా దాడులు చేస్తు న్నా రు. తరువాత మిగతా దుకాణాలు చెక్​చేయనున్నారు.

ఇప్పటి వరకు 90 శాతం కోటా పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా 91.83 లక్షల రేషన్​కార్డుదారులకు 17,349 దుకాణాల ద్వారా బియ్యం డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 82 లక్షల కార్డులకు 1.70 లక్షల మెట్రిక్​టన్నులు పంపిణీ చేశారు. మిగతా కోటా రెండు మూడు రోజుల్లో పూర్తికావొచ్చని, ప్రతి నెలా బియ్యం 90 శాతానికి మించి లబ్ధిదారులు తీసుకోవ డం లేదు. ధనవంతులు చాలా మంది డీలర్లకే రేషన్​ఇవ్వడం పదేళ్లు నుంచి ఆనవాయితీ వస్తోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్​దాడులు చేస్తోంది.

నిరంతరం రేషన్​ కార్డులు ఉత్తమాటేనా

కొత్త రేషన్​కార్డుల మంజూరు విషయంలో కటాఫ్​డేట్​లేదని, నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకటనలకే పరిమితమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారి కార్డుకు సంబంధించిన పరిశీలన జరగడం లేదని తెలిసింది. స్థానిక ఏఎస్‌వోలు ఇంటింటి సర్వే నిలిపివేసారని, అక్టోబర్​తరువాత కొత్తకార్డుల విషయం చూస్తామని చెబుతున్నారు.

Next Story