T Congress: టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. జూన్ 10 నుంచి సరికొత్త కార్యక్రమం

by Prasad Jukanti |

తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

T Congress: టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. జూన్ 10 నుంచి సరికొత్త కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం చేత పరిష్కరించే విషయంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10 నుంచి గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో ప్రజా ప్రతినిధులు ఉండేలా సరికొత్త కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. ఇదివరకే మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు గాంధీ భవన్ లో (Gandhi Bhavan) అందుబాటులో ఉండేలా కార్యక్రమం రూపొందించారు. జూన్ 10వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10బ గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. వీరు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వాటిని ప్రభుత్వం చేత పరిష్కరించేలా కృషి చేయనున్నట్లు టీ పీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత రోజుకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ లు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండనుండగా ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి రోజు ఇద్దరు చొప్పున గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

రేపట్నించి మళ్లీ మంత్రులతో ముఖాముఖీ:

అనివార్య కారణాలతో ఆగిపోయిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ పునః ప్రారంభం కాబోతున్నది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజా పాలన లో భాగంగా ‘మంత్రులతో ముఖాముఖీ’ కార్యక్రమాన్ని 2024 లో టీపీసీసీ ప్రారంభించారు. అయితే ఇటీవల ఈ కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల నిర్వహించడం లేదు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ చొరవతో రేపటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ తెలిపింది.

Next Story