- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: అసలే 'లోకల్' ఎలక్షన్ టైమ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు?
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే (NDA) కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను పేరును ఖరారు చేసింది. తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ప్రయత్నాలు సైతం మొదలు పెట్టింది. లోక్ సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఏకగ్రీవం చేయాలని బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు పలు ప్రాంతీయ పార్టీల అధినేతలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. మరోవైపు తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఇండియా కూటమి (India Alliance) సైతం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సెప్టెంబర్ 9వ తేదీన జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం ఎటువైపు మద్దతు ఇస్తాయనేది ఉత్కంఠగా మారింది.
కేసీఆర్ ఎటువైపు?:
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. అధికారం దూరమయ్యాక పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఓ వైపు ప్రత్యర్థులు ఎదురు దాటి మరోవైపు పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని సొంతపార్టీలోనే విమర్శలు కారు పార్టీ అధినేత కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగబోతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏ సైడ్ తీసుకోబోతున్నది అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారనుంది. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ యూపీఏ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం గులాబీ పార్టీకి రాజ్యసభలో మాత్రమే నలుగురు సభ్యులు ఉన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ (BRS) ఎన్డీయే పక్షమా లేక ఇండియా పక్షమా ఈ రెండు పక్షాలను కాదని తటస్థ వైఖరి తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణలో ఎంఐఎం పార్టీకి ఒక ఎంపీ స్థానం ఉంది. హైదరాబాద్ లోక్ సభ స్తానానికి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నందునా ఈ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ తో సత్సంబందాలను మెయింటెన్ చేస్తున్న ఎంఐఎం జాతీయ స్థాయిలో మాత్రం హస్తం పార్టీని బహిరంగంగానే విభేదిస్తున్నది. ఈ నేపథ్యంలో ఓవైసీ డెసిషన్ ఎంటో అనేది కూడా ఈ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.






