కాంగ్రెస్ అభ్యర్థుల ‘బాండ్’ ప్లాన్.. ప్రజలు నమ్మితే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే..!

by Satheesh |

కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అభ్యర్ధులు బాండ్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు. రూ.100 బాండ్ పేపర్లపై రాత పూర్వక ప్రామిస్‌లు చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ‘బాండ్’ ప్లాన్.. ప్రజలు నమ్మితే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అభ్యర్ధులు బాండ్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు. రూ.100 బాండ్ పేపర్లపై రాత పూర్వక ప్రామిస్‌లు చేస్తున్నారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, తదితరులు సోమవారం తమ బాండ్ పేపర్లను ప్రజలకు అందజేశారు. నియోజకవర్గాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాండ్ పేపర్లను అందజేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలు అమలు చేస్తామని స్టాంప్ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వేవ్‌ను పరిశీలిస్తున్న అభ్యర్ధులు ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేందుకు బాండ్ పేపర్లు ఇస్తున్నామని ఆయా నేతలు తెలిపారు.

Next Story