కొత్త పెన్షన్లు ఎప్పుడు.. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ?

by velandi.Saikiran |

ఖమ్మం జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం అర్హులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో విడుదల

కొత్త పెన్షన్లు ఎప్పుడు.. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ?
X

కొత్త పెన్షన్లు ఎప్పుడు?

అర్హులకు పెన్షన్ల కోసం నిరీక్షణ

సదరం ఉన్నా ఉపయోగం లేదు

కుప్పలు తెప్పలు పెన్షన్ దరఖాస్తులు

కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు ప్రదక్షిణలు

కొత్త వాటి కోసం ఎదురుచూపులు...

ఖమ్మం జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం అర్హులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.రెండు వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.నాలుగు వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18నెలలు దాటినా కొత్త పెన్షన్ అమలు కావడం లేదని అర్హులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలలో పెన్షన్ దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయినట్లు తెలుస్తున్నది. గత ఐదేళ్లుగా కొత్త పెన్షన్ శాంక్షన్ లేకపోవడంతో వేల సంఖ్యలో అర్హులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వైద్య శాఖ అధికారులు పదుల సంఖ్యలో సదరం క్యాంపులు నిర్వహించి, అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్నా కొత్త పెన్షన్ అమలు కాకపోవడంతో దివ్యాంగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇటీవల జిల్లాలో కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ధర్నా చేసిన విషయం తెలిసిందే.

దిశ, మయూరి సెంటర్: ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.రెండు వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ రూ.నాలుగు వేలు ఇస్తామని, దివ్యాంగుల పింఛన్ రూ.ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తామని ప్రకటించడంలో అర్హులైన వారిలో ఆశలు రేపాయి. కానీ అధికారంలోకి వచ్చి 18నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరివాళ్లు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, బోదకాలు ఉన్నవారు, డయాలసిస్ పేషంట్స్, బీడీ కార్మికులు, సింగిల్ ఉమెన్స్, హెచ్ఐవి పేషెంట్స్ తదితరులు పెన్షన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.

జిల్లా వ్యాప్తంగా ఇలా....

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర మున్సిపాలిటీ, సత్తుపల్లి మున్సిపాలిటీ, వైరా మున్సిపాలిటీ, ఏదులాపురం మున్సిపాలిటీలుగా కలిగి ఉన్నాయి. వీటితో పాటుగా జిల్లాలో మరో 20మండలాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిక లెక్కల ప్రకారం అందరూ కలిపి మొత్తం 1,85,644 పలు రకాల పెన్షన్‌లను పొందుతున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 42.97కోట్ల వరకు ప్రతినెల ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో అర్హులకు అకౌంట్లో జమవుతున్నాయి. ఖమ్మంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ 70,350మందికి, వితంతు పెన్షన్ 70,413 మందికి, వికలాంగుల పెన్షన్ 27,779 మందికి, కల్లుగీత కార్మికులు 3140మందికి, నేత కార్మికులు 427మందికి, హెచ్ఐవీ బాధితులు3,419 మందికి, బోదకాలు బాధితులు1380 మందికి, డయాలసిస్ పేషంట్స్ 275మందికి, సింగిల్ వుమెన్ 8459 మందికి, బీడీ వర్కర్స్ ఇద్దరికి అందుతున్నాయి.

కొత్త పెన్షన్లు ఎప్పుడు..

జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలలో పెన్షన్ దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయి ఉన్నట్టు తెలుస్తుంది. గత ఐదేళ్ల నుంచి కొత్త పెన్షన్ శాంక్షన్ లేకపోవడంతో వేల సంఖ్యలో అర్హత కలిగి ఉన్న దరఖాస్తుదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వైద్య శాఖ అధికారులు పదుల సంఖ్యలో సదరం క్యాంపులు నిర్వహించి, అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్నా గాని కొత్త పెన్షన్ అమలు లేకపోవడంతో జిల్లా దివ్యాంగులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని, దరఖాస్తుదారులు కోరుతున్నారు.

===========

దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలి

ప్రభుత్వం సదరం క్యాంపులు నిర్వహించినా ఉపయోగం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో దివ్యాంగులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల జిల్లాలో కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ధర్నా చేశాం. మానవత దృక్పథంతో వికలాంగులకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం.

అమరబోయిన లింగమూర్తి, తెలంగాణ వికలాంగుల ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు

Next Story