- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
K.A. Paul : కొత్త ప్యాకేజీ స్టార్ తీన్మార్ మల్లన్న : కే.ఏ.పాల్
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్యాకేజీ స్టార్ట్స్ షర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు(New Package Star) వచ్చాడని..అతడే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)అని ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్(Public Peace President K.A. Paul)విమర్శించారు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్యాకేజీ స్టార్ట్స్ షర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు(New Package Star) వచ్చాడని..అతడే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)అని ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్(Public Peace President K.A. Paul)విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కే.ఏ.పాల్ తీన్మార్ మల్లన్నపై, ఎంపీ ఆర్.కృష్ణయ్యపై విమర్శలు గుప్పించారు. తీన్మార్ మల్లన్నపై ఎన్నో రౌడీ షీట్ కేసులు ఉన్నాయని పాల్ ఆరోపించారు. నేను బీసీని అంటూ 80కోట్లు ఖర్చు పెట్టి కృష్ణయ్యతో కలిసి నిన్న బీసీ మీటింగ్ పెట్టాడని..బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కృష్ణయ్య మేం బిక్షగాళ్లమా అంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీలకు బీసీలను తాకట్టుపెట్టి పదవులు పొందాడని పాల్ మండిపడ్డారు. కృష్ణయ్య శిష్యుడే తీన్మార్ మల్లన్న అని..దానికి రుజువే నిన్న బీసీ మీటింగ్ అని పాల్ ఆరోపించారు.
కాగా ఇటీవల బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా విమర్శలు చేసి సంచలనం రేపాడు. ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదిస్తున్న మల్లన్న తరుచు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీసీల సంఘటితం కోసమంటూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం లక్ష్యంగా మల్లన్న చేస్తున్న విమర్శలు సొంత పార్టీ ప్రజాప్రతిధుల నుంచి కూడా విమర్శలకు గురువుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీల కోసం గళమెత్తుతున్న మల్లన్న పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది ప్రశ్నగా మారింది. తన బీసీ నినాదంతో దూకుడుగా వ్యవహరిస్తున్న మల్లన్న మునుముందు ఇంకేం చేయబోతాడన్నది కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది.






