సీఎం రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గ‌వ‌ర్నర్ భేటీ.. ఆ రెండు అంశాలపై చర్చ

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో న్యూజెర్సీ గ‌వ‌ర్నర్ ఫిలిప్ డి.ముర్పీ (Philip D. Murphy) ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గ‌వ‌ర్నర్ భేటీ.. ఆ రెండు అంశాలపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో న్యూజెర్సీ గ‌వ‌ర్నర్ ఫిలిప్ డి.ముర్పీ (Philip D. Murphy) ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎన‌ర్జీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ (సినిమా రంగం), మౌలిక వ‌స‌తులు (మెట్రో, ప‌ట్టణ ర‌వాణా), మూసీ రివ‌ర్ ఫ్రంట్ త‌దిత‌ర అంశాల‌పై సీఎం రేవంత్, న్యూజెర్సీ గ‌వ‌ర్నర్‌తో ప్రధానంగా చ‌ర్చించారు. తెలంగాణ విజ‌న్-2047 సాధ‌న‌లో త‌మ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి, ఫిలప్ డి.ముర్పీ వివ‌రించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియ‌జేశారు. ఈ భేటీలో గ‌వ‌ర్నర్ స‌తీమ‌ణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story