- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy : నూతన విద్యావిధానంతో దేశ భవిష్యత్తుకు మేలు : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central Government) దేశంలోని అనేకమంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ ఆలోచనల మధింపుతో 33 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన నూతన విద్యా విధానం(New Education Policy) దేశభవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central Government) దేశంలోని అనేకమంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ ఆలోచనల మధింపుతో 33 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన నూతన విద్యా విధానం(New Education Policy) దేశభవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ, గవర్నమెంట్ పోలీస్ బాలుర హై స్కూల్ సీపీఎల్ లో ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఇప్పడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే నూతన విద్యావిధానాన్ని కొంతమేరకే అమలవుతుందని.. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో విద్యార్థులకు, దేశ భవిష్యత్తుకు మేలు జరుగుతుందన్నారు. ఈ విధానం ప్రాథమిక స్థాయిలోనే ప్రొఫెషనల్ కోర్సులు నేర్పించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించడం, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అన్ని రంగాల్లో మెరుగైన వసతులు కల్పించేలా విద్యావిధానాన్ని తీసుకురావడం జరిగిందని, దేశంలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, గవర్నమెంట్ స్కూళ్లలో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్ బుక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేసి, శుభ్రత కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అంబర్ పేట ఫ్లైఓవర్ కు సంబంధించి భూసేకరణను జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేదని.. రోడ్డు విస్తరణ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అని..వారు సహరించి భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానిస్తామన్నారు. కొన్నిచోట్ల అక్రమంగా ప్రార్థనా మందిరాలు రాత్రికిరాత్రే నిర్మాణాలు చేపట్టి రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని..అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.






