- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC elections: బలమే బలహీనతగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి కొత్త చిక్కులు
ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హాట్ టాపిక్ గా మారుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ఉత్కంఠను రేపుతున్నాయి. పోలింగ్‌కు మరో వారంరోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గెలిచి నిలిచేందుకు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ రెఫరెండం అనే చర్చ స్టేట్ పాలిటిక్స్‌లో మరింత హీట్‌ను పెంచుతున్నది. దీంతో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా నెగ్గుకురావాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. తక్కువ ఓటర్లు ఉండే టీచర్ ఎమ్మెల్సీల విషయాన్ని పక్కన పెడితే నిరుద్యోగులు, యువత భాగస్వామ్యంగా ఉండే గ్రాడ్యుయేట్ ఎన్నికలపై అందరూ ఫోకస్ పెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నదనేది పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వుట్కూరి నరేందర్‌రెడ్డిని (Alphorse Narender Reddy) బరిలోకి దింపగా తాజాగా ఆయన పట్ల సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అవుతున్నది.
ప్లస్ అనుకుంటే మైనస్..?!
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి అయిన వుట్కూరి నరేందర్‌రెడ్డికి బలం అనుకున్న విద్యాసంస్థలే ఎన్నికల ప్రచారంలో ఆయనకు నెగెటివ్‌గా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రచారం మొదలు పెట్టిన నాటి నుంచి ఆయన విషయంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, తల్లితండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. తాజాగా సోషల్ మీడియాలో మరో అంశం తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. విద్యాసంస్థల అధిపతిగా ఉంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న నరేందర్‌రెడ్డి 317 జీవో, టీజీపీఎస్సీ పేపర్ లీక్స్, గ్రూప్-1 ఇష్యూ, జాబ్ క్యాలెండర్, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్స్, పీఆర్సీ వంటి సమస్యలప్పుడు ఎక్కడున్నారు? అంటూ సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ వైరల్‌గా మారాయి. తాము సమస్యల్లో ఉన్నప్పుడు నోరు మెదపని నరేందర్‌రెడ్డి ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో తమ ఓట్లు అడగటం ఏంటని గ్రాడ్యుయేట్స్ నిలదీస్తున్నారు.
టఫ్ టైమ్‌లో కొత్త చిక్కులు..
రాష్ట్రంలో అధికార పార్టీ, సొంతంగా విద్యాసంస్థల నెట్‌వర్క్, టికెట్ వస్తే చాలు గెలుపు సులభం అనుకున్న నరేందర్‌రెడ్డికి ప్రచారంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు పోలింగ్ తేదీ ముంచుకు వస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో రోజు రోజుకు పరిస్థితులు మరింత టఫ్‌గా మారుతుండటం చర్చగా మారింది. ప్రజల్లో నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటే మరోవైపు టీమ్ వర్క్ విషయంలో నరేందర్‌రెడ్డి సొంత పార్టీ నేతలనే నమ్మడం లేదనే చర్చ హస్తం పార్టీ టాప్ లీడర్లను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యాసంస్థల విషయంలో ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల దృష్ట్యా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు పూర్తిస్థాయిలో సపోర్టుగా లేరనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు తీర్పు చెప్పనున్నారు. వీరిలో మెజార్టీ ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ నుంచే ఉన్నారు. సొంత పార్టీలోనే నరేందర్ రెడ్డి పట్ల తీవ్రమైన వ్యతిరేకతతోపాటు రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ అల్ఫోర్స్‌ను అన్ని వైపులా కట్టడిచేసేలా ప్రత్యర్థులు అస్త్రాలు ప్రయోగిస్తుండటంతో ఆయన పెద్దల సభ ప్లాన్ అడ్డం తిరుగుతోందా అనే టాక్ వినిపిస్తోంది.






