తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ బదిలీ.. ఆయన స్థానంలో ఎవరంటే?

by Prasad Jukanti |   (  Updated:2024-07-05 12:22:31  IST  )

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి బదిలీ అయ్యారు.

తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ బదిలీ.. ఆయన స్థానంలో  ఎవరంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ రాజ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రిలీవ్ చేసిన ఈసీ.. వికాస్ రాజ్ స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు వికాస్ రాజ్ ఆధ్వర్యంలోనే జరిగాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఎన్నికల ప్రధాన అధికారిని నియమించడం ఆసక్తికర పరిణామంగా మారింది.

Next Story