- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AYUSH: నియామకపత్రాలు త్వరలోనే అందజేస్తాం.. వారికి ఆరోగ్య మంత్రి భరోసా
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగంలో నూతనంగా 138 మంది మెడికల్ ఆఫీసర్స్‌గా ఎంపిక అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ (AYUSH) విభాగంలో నూతనంగా 138 మంది (Medical Officers) మెడికల్ ఆఫీసర్స్‌గా ఎంపిక అయ్యారు. వీరు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha)ని సంగారెడ్డి లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్‌గా ఎంపికైనా డాక్టర్లకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్స్ గా ఎంపికైన డాక్టర్లు ప్రభుత్వానికి, మంత్రి దామోదర రాజనర్సింహకి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. కాగా, మంత్రిని కలిసిన వారిలో డా. కిరణ్ కుమార్, డా. అనిల్, డా. సంపత్ కుమార్, డా. విజేత, డా. శ్రీదేవి, డా. నిలోఫర్ అంజుమ్‌లు ఉన్నారు.
Next Story






