- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: ఓఆర్ఆర్‌పై మరో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులు?
తాజాగా పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత.. వరుసగా ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న GEEPEE ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టగా.. బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
తాజాగా పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న NUEGO ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బస్సు బోల్తా పడటంతో వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారమిచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. రోడ్డుకి సైడ్ ఉన్న డివైడర్ దాటి బోల్తా పడటంతో ప్రయాణికులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






