కేటీఆర్ పై నెటిజన్ల రివర్స్ ఫైర్

by Dishafeatures2 |
కేటీఆర్ పై నెటిజన్ల రివర్స్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పైర్ అయ్యారు. దళితులకు మూడు ఎకరాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? దళితులకు ఎంత మందికి దళితబంధు ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారనగానే ప్రగతిభవన్ నుంచి బయటకు రారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయాల కోసమే విమర్శలా అంటూ కేటీఆర్ తీరును ఎండగట్టారు.

తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధాని మనకు అవసరమా?.. విభజన చట్టంలోని హామీల వైఫల్యంపై ఏకరువు పెట్టడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ గురువారం పోస్టింగ్ పెట్టారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.? అని పేర్కొనడంతో నెటిజన్లు రివర్స్ ఫైర్ అయ్యారు. ‘‘పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వరు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వరు.. దళిత బంధు ఇవ్వరు.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయరు..మహిళలకు భద్రత ఇవ్వరు.. సీఎం దృష్టిలో అసలు ప్రజలే లేనప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ ట్విట్లకు నెటిజన్లు రాష్ట్రంలోని సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అరుణ్.. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? దళితబంధు అసలు ఎక్కడ.. ఎంతమందికి ఇచ్చారు.. అందులో ముఖ్యంగా దళితులకు ఎంతమందికీ ఇచ్చారు?.. కరీంనగర్ ను లండన్ చేస్తా అన్నాడు ఎక్కడ కనిపిస్తుంది..? ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఎక్కడ ఇచ్చారు? ఇంకా చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. వట్టిగా బిత్తిరీ మాటలు మాట్లాడకు అంటూ పైర్ అయ్యారు.

అనిల్ రెడ్డి.. జాతీయ హోదా ఇవ్వాలంటే కేంద్ర జలసంఘం నిబంధనలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినాడా కేసీఆర్?.. అంటే వచ్చే సమాధానం లేదు. మరి అవి ఏవీ లేకుండా ఉత్తిపుణ్యానికే హోదా ఇచ్చి ప్రజల పైసలు కేసీఆర్ లెక్క వృథా చేయమంటావా?

సత్యప్రసాద్.. ప్రజల అవసరాల కన్నా రాజకీయ అవసరాలే ముఖ్యమా?

అక్బర్ మోహ్మద్.. ఒక పేదవాడిని ఇళ్లు లేని వాడిని.. పక్కా టీఆర్ఎస్ కార్యకర్తను.. సోషల్ మీడియాలో మెదక్ జిల్లా నర్సాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరగా పూర్తి చేసి మీరు పట్టించుకోని మా నర్సాపూర్ కు ఒక్కసారి వచ్చి చూసి అధికారులకు చెప్పి పోతారని ఒక పేదవాడిగా ఆశిస్తున్నా.

విజయ్.. దళిత సీఎం, లక్షరూపాయల రుణమాఫీ, ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు తీసేసి రెగ్యులరైజేషన్, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం, ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు, రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు?..నిరుద్యోగ భృతి, 24 గంటల ఉచిత కరెంటు ఏదీ?

లక్ష్మణ్ గుప్తా.. రైతులకు నష్టపరిహారం ఇవ్వం.. పాఠశాలల అభివృద్ధికి పైసా ఇయ్యం.. ఎందుకు ఇక బీఆర్ఎస్ ఉండి రాష్ట్రంలో అని ప్రశ్నించారు.

అజ్ఞాత వాసి.. ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారు.. ప్రధాని పర్యటన అనగానే ప్రగతి భవన్ కూడా దాటని మీరు కూడా మాట్లాడుతారా?

రాకేష్.. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వం.. విద్య ఇవ్వం.. ఆరోగ్యం ఇవ్వం..రైతు భీమా ఇవ్వం.. మహిళలకు భద్రత ఇవ్వం.. సీఎం దృష్టిలో అసలు ప్రజలే లేనప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి? మీ బూటకపు మాటలు మేమెందుకు వినాలి?

తెలంగాణ ఉద్యమ బిడ్డ.. నీకు సీఎం పదవి ఇయ్యం.. నీకు మరోసారి అవకాశం ఇయ్యం...నీ కుటుంబాన్ని ఇకపై భరించం..మీ పార్టీని ఇకపై సహించం.. మీకు ఓటెయ్యం.. మీకు అసెంబ్లీలో చోటియ్యం.

ఇలా నెటిజన్లు మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రాన్ని విమర్శస్తున్నారు సరే.. మరి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఏదీ అని నిలదీశారు. కేవలం రాజకీయాల కోసమే నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజల, నిరుద్యోగుల, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను గాలికి వదలిచేశారని మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, నిరుద్యోగభృతి ఇస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదని మండిపడుతున్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ ఏమైందని నిలదీస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



Next Story