Wear Helmet: ఆప్షనల్ కాదు.. అవసరం! HYD ట్రాఫిక్ పోలీస్ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా

by Ramesh Naini |   (  Updated:2025-04-11 05:39:59  IST  )

ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు (Hyderabad Traffic Police) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్న వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

Wear Helmet: ఆప్షనల్ కాదు.. అవసరం! HYD ట్రాఫిక్ పోలీస్ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు (Hyderabad Traffic Police) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్న తీరులో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఏమౌంతుందో సెటైరికల్‌గా సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో అవి వైరల్ కూడా అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్-2025 సీజన్ సందర్భంగా తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విరాట్ కోహ్లీ IPLలో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

‘మీ తలలో విడిభాగాలు లేవు. అది గ్రౌండ్‌లో అయినా, రోడ్డు అయినా.. హెల్మెట్ (helmet) ఆప్షనల్ కాదు.. బతకడానికి అవసరం’ అని ప్రమాదంలో తలకు గాయాలైతే బతికించడం కష్టం అని పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణించే వారు ఈ విషయాన్ని తప్పక పాటించాలని సూచించారు. అబ్బా ఏం వాడకం.. మీ క్రియేటివిటి సూపర్ సార్.. అంటూ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే రోడ్లు కూడా క్రికెట్ పిచ్‌ల మాదిరి ఉండాలని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story