- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: మూగజీవాల ప్రేమ అంతులేనిది! యువతితో ఆవు చూపించే ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా
మూగజీవాల ప్రేమ ముందు మనుషుల ప్రేమ కూడా తక్కువే అని జంతు ప్రేమికులు భావిస్తుంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మూగజీవాల (Domestic animals) ప్రేమ ముందు మనుషుల ప్రేమ కూడా తక్కువే అని జంతు ప్రేమికులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘ప్రేమను మాటల్లో చెప్ప లేక పోయిన, చేతల్లో ఎంతో మధురముగా చూపవచ్చు.. ఇది గోమాతకు ప్రత్యేకం’ అంటూ చిత్ర అనే ఎక్స్ యూజర్ వీడియోను షేర్ చేశారు. అందులో ఒక ఆవు ఓ యువతితో చాలా ఆప్యాయతగా ఉంటుంది. (young woman) యువతి ఓడిలో ఆవు చిన్న పిల్లాడి మాదిరి సేదతీరేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు యువతి బాధగా ఉన్న సమయంలో ఆవు యువతిని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ యువతి సైతం ఆవును అంతే ప్రేమగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆవుకు యువతికి మధ్య ఉన్న ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోను దాదాపు 14 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కాగా, జంతు ప్రేమికులు ముగజీవాలపై ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు. మనుషులకు ఆపద వస్తే ఎవరైనా చూసుకుంటారు.. కానీ మూగజీవాలకు ఆపద వస్తే బాగోగులు వస్తే ఎవరూ చూసుకుంటారని.. మూగజీవాలపై ప్రేమతో కొందరు ఉద్యోగం వదిలేసి మరీ వాటికి సేవ చేయడానికి సంస్థలు పెడుతున్నారు. ఇటీవల ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో "సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ సంస్థ"ను స్థాపించారు. ఏడుగురు యువకులు పూర్తి సేవాభావంతో ఈ సంస్థను నిర్వహిస్తూ మూగజీవాలకు అండగా నిలుస్తున్నారు. వేలాది జంతువులను సంరక్షిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు.






