- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమ్మిట్‌లో నెట్ జీరో స్టాల్‌కు భారీగా సందర్శకుల తాకిడి.. ఎందుకంటే?
తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా ఎక్స్‌పోలో ఏర్పాటుచేసిన నెట్ జీరో స్టాల్ కు విశేష ఆదరణ లభిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా ఎక్స్‌పోలో ఏర్పాటుచేసిన నెట్ జీరో స్టాల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ స్టాల్ లో ఎలక్ట్రిసిటీ వెహికల్, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బీఈఎస్ఎస్, సోలార్ ప్యానల్స్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు స్టాల్ ను సందర్శించి అక్కడ ప్రదర్శిస్తున్న నమూనాలను నిశితంగా పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ప్రదర్శించడం వల్ల ఈ స్టాల్ అత్యధిక సందర్శకులను ఆకర్షించింది.
పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ పనితీరుకు సంబంధించి రియల్ టైమ్‌లో ప్రదర్శించడాన్ని పలువురు అభినందించారు. దాని గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యావరణం, గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించడం గురించి నెట్ జీరో క్విజ్ సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. పలువురు సందర్శకులు ఎంతో ఉత్సాహంగా ఈ క్విజ్ లో పాల్గొని నెట్ జీరో సర్టిఫికెట్ ను పొందారు. టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి, డైరెక్టర్లు డా. నరసింహులు, శివాజీ, రెడ్కో ఎండీ అనిలా, ఇతర అధికారులు... సందర్శకులకు ఈ నమూనాల గురించి డెలిగేట్స్ కు వివరించారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉందని అధికారులు పేర్కొన్నారు.






