- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ఈపీ 2020ని అమలు చేసి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: టీపీయూఎస్
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020ని అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 4వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షులు వొద్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020ని అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 4వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షులు వొద్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 4 న మండల, కాంప్లెక్స్ స్థాయిల్లో నిరసనలు, జూలై 14న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, జూలై 22 న రాష్ట్ర స్థాయి ధర్నా ఉంటుందని పేర్కొన్నారు.
డిమాండ్లలో ప్రధానంగా పీఆర్‌సీ కమిషన్ రిపోర్టును తెప్పించుకుని, వెంటనే 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులతో పాటు, నిలిచిపోయిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 317 బాధితుల కోసం తెచ్చిన జీవో 190 కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులందరికీ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని, జీవో నెంబర్ 25ని సవరించి, ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేయాలని, గిరిజన, బీసీ, సోషల్ వెల్ఫేర్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.






