- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో అంత్యక్రియలు.. పాడెపై మారిన మృతదేహం.. శ్మశానంలో ఖంగుతిన్న బంధువులు!
వరంగల్ MGM ఆసుపత్రి మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ MGM ఆసుపత్రి మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో మూడ్రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం కుమారస్వామి మృతదేహానికి బదులు మరొకరి డెడ్‌బాడీని మార్చురీ సిబ్బంది బంధువులను అప్పగించారు. దహన సంస్కారాల వేళ మృతదేహం కుమారస్వామిది కాదని బంధువులు గుర్తించారు. దీంతో మళ్లీ వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. మార్చురీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై పైఅధికారులకు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కొవిడ్ సమయంలో ఎన్నో వేల ప్రాణాలు నిలబెట్టిన MGM ఆసుపత్రి ప్రతిష్ట ఇప్పుడు రోజురోజుకూ మసకబారుతోంది. రోజుకో ఘటన వెలుగుజూడటం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.






