- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ కాలేజీల చెలగాటం
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు విద్యార్థులను, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు విద్యార్థులను, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడుతున్నామని చెబుతూనే అధిక ఫీజుల కోసం కోర్టులకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అనేక వృత్తి విద్యా కాలేజీల్లో అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం ప్రవేశ పెడుతుందనే భయంతోనే ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని మండి పడ్డారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇచ్చిందన్నారు. ప్రతిఏటా జేఎన్‌టీయూహెచ్ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పారదర్శకంగా లేకపోవడంతో వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
విజిలెన్స్ నివేదిక బహిర్గతం చేయాలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలి. అందులో నాణ్యతా ప్రమాణాలు పాటించని, సరైన వసతులు లేని కళాశాలల వివరాలు ఉన్నాయి. ల్యాబ్, అధ్యాపకుల కొరత, ఇతర నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోని కాలేజీల అనుమతులను వెంటనే రద్దు చేయాలి. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - నాగరాజు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రెటరీ






