- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుధ్యం, పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం.. 10 మంది అధికారుల సస్పెన్షన్
జీహెచ్ఎంసీలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులపై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కఠిన చర్యలు తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లపై వేటు వేస్తూ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గుర్తించిన కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్యంపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం గుర్తించింది.
ఏడుగురు సస్పెన్షన్..
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లకు గాను, 10 సర్కిళ్లకు సంబంధించిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే ఏడుగురిని సస్పెండ్ చేయాలని కమిషనర్ నిర్ణయించారు. విధుల్లో అలసత్వం వహించిన మరో ముగ్గురిని ప్రధాన కార్యాలయానికి (Head Office) అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






