- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యం.. ‘రాంకీ’కి GHMC నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ చెత్త నిర్వహణ, భవ న నిర్మాణ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యం వ హించిన రాంకీ సంస్థకు చెందిన రెండు కంపెనీలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ చెత్త నిర్వహణ, భవ న నిర్మాణ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యం వ హించిన రాంకీ సంస్థకు చెందిన రెండు కంపెనీలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. గార్బేజ్ వల్నరెబుల్ పాయింట్లలో చెత్త సేకరణ, జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు రవాణా సమయానికి జరగడం లేదని గుర్తించిన జీహెచ్ఎంసీ గురువారం హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలి డ్ వేస్ట్ లిమిటెడ్ (హెచ్ఐఎంఎస్డబ్ల్యూ)కు నోటీసులు జారీచేశారు. దీంతోపాటు గ్రేట ర్‌లో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని సంబంధిత మెడికల్ ఆఫీస ర్లు, ఇంజినీర్లు పదేపదే చెప్పినా పట్టించుకో కపోవడంతో హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు జీహెచ్ఎంసీ శు క్రవారం నోటీసులు జారీచేసింది. సకాలం లో స్పందించకుంటే ఒప్పందం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నో టీసులో పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో అ లసత్వం వహించినందుకు గత నెలలో రూ. లక్ష పెనాల్టీ సైతం వేసింది.
ఉదయం 9.30 గంటల వరకే..
నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉదయం 9.30 గంటల కల్లా చెత్తను తొలగించాల్సిందేనని జీహెచ్ఎంసీ హుకూం జారీ చేసింది. ఆదేశాలను బేఖాతరు చేస్తే హెవీ పెనాల్టీలతోపాటు చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. నగ ర వ్యాప్తంగా ఉన్న 2,532 గార్బేజ్ వల్నరె బుల్ పాయింట్ (జీవీపీ)లతోపాటు బిన్ పాయింట్లలో ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల కల్లా చెత్తను ఒప్పందం మేరకు సంస్థ తప్పనిసరిగా తొలగించాలి. అక్టోబర్ 16న నగర వ్యాప్తంగా ఉన్న 2,532 గార్బేజ్ వల్నరెబుల్ పాయింట్ (జీవీపీ)లలో కేవలం 1,879 పాయింట్ల లో మాత్రమే నిర్దేశిత సమయంలో తొలగించింది. నిర్దేశిత సమయంలో జీవీపీ, బి న్ పాయింట్‌లలో చెత్తను తొలగించడం లో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్ (హెచ్ఐఎంఎస్‌డ బ్ల్యూ) సంస్థ విఫలమైందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. నగరంలో ప్రతిపాదించిన 1,000 సెకండ్ స్టోరేజ్ బిన్లలో 850 బిన్‌ల ను మాత్రమే ఏర్పాటు చేసింది. మిగిలిన బిన్లను వెంటనే ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉదయం 09.30 గంటల కల్లా వ్యర్థాలను తొలగించాలని కమిషనర్ సంస్థను ఆదేశించారు. లేకుంటే భారీగా పెనాల్టీలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలోనూ ఇంతే..
గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్ వేస్ట్ నిర్వహణలో రోజుకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా జీహెచ్ఎంసీ చెల్లిస్తున్నది. ఏడాదికి సుమారు రూ.50 కోట్లపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయినా సకాలంలో జీవీపీ, బిన్ పాయింట్లలో ని చెత్తను తొలగించకపోవడంతో గతనెలలో జీహెచ్ఎంసీ రూ.లక్ష పెనాల్టీ వేసింది. దీంతోపాటు భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల తొలగింపు విషయంలోనూ జూన్ 25, జూలై 30 తేదీల్లోనూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ‘డోంట్ కేర్’ అన్నట్టుగానే వ్యవహరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
నిర్మాణ వ్యర్థాల తొలగింపులోనూ..
వ్యర్థాలను తొలగించడంలో హైదరాబాద్ సీ అండ్ డీ వెస్ట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ (రాంకీ అనుబంధం) నిర్లక్ష్యం వహించడంతో జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నోటీసు జారీ చేశారు. నగరంలోని సర్కిల్ అధికారులు, ఏఎంఓహెచ్, డీఈఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)లు విజ్ఞప్తి చేసినా వ్యర్థాల తొలగింపు పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ సత్వరమే స్పందించి, వ్యర్థాలను తొలగించకపోతే క్లాజ్ 7.4 మేరకు ఒప్పందం రద్దు చేయడానికి, భారీ జరిమానాలు విధించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిశుభ్రతే తమకు ప్రధానం అని, ప్రజల సౌకర్యార్థం వెంటనే సదరు సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.






