- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET (UG) పేపర్ లీక్ ఎఫెక్ట్.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళన షురూ
నీట్ (UG) పేపర్ లీక్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేంద్రం భారీ సంస్కరణలు చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నీట్ (UG) పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రక్షాళనకు పూనుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు తలెత్తకుండా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఏ (NTA) పనితీరును మెరుగుపరిచేందుకు, పరీక్షల ప్రక్రియలో మార్పులను సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి రాధాకృష్ణన్ కమిటీ తన సిఫార్సులను సమర్పించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్టీఏను అంతర్గతంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోం ది.
ఎన్టీఏకు నలుగురు సీనియర్ IAS అధికారులు
ఎన్టీఏ సంస్కరణల్లో భాగంగా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు నలుగురు సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎన్టీఏకు బదిలీ చేసింది. అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ, పరీక్షల పర్యవేక్షణ విభాగాలను ఐఏఎస్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. అలాగే, ఎన్టీఏలో ఖాళీగా ఉన్న మూడు అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి పోస్టుల భర్తీకి కేంద్రం తాజాగా అధికారిక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశంలో జరిగే అన్ని జాతీయ స్థాయి పోటీ పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా నిర్వహించేందుకే ఈ ఆకస్మిక ప్రక్షాళన చేపట్టినట్లుగా కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.






