రేపే దేశవ్యాప్తంగా NEET-UG ఎంట్రన్స్ టెస్ట్.. పరీక్షా కేంద్రాల వద్ద అమల్లో సెక్షన్ 163

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-02 13:33:38  IST  )

దేశవ్యాప్తంగా ఆదివారం (03/05/2026) NEET-UG పరీక్ష జరగనుంది. ఇందుకోసం NTA అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపే దేశవ్యాప్తంగా NEET-UG ఎంట్రన్స్ టెస్ట్.. పరీక్షా కేంద్రాల వద్ద అమల్లో సెక్షన్ 163
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆదివారం (03/05/2026) NEET-UG పరీక్ష జరగనుంది. ఇందుకోసం NTA అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. నీట్ పరీక్ష జరగనున్న పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లోకి రానుంది. తెలంగాణలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక నోటీస్ విడుదల చేశారు. నోటీస్ ప్రకారం.. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురికంటే ఎక్కువమంది ఉండకూడదు. గుంపులు గుంపులుగా ఉండకూడదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్ష జరగనుండగా.. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. 1.30 గంటలకు ఎంట్రీ ఆపేస్తారు. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాప్ తప్పనిసరిగా ఉండాలని, వర్షాలు పడే అవకాశాలుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని NTA సూచించింది.

Next Story