- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పరీక్ష రాసిన తళ్లీకూతుళ్లు
చదువుకు వయసుతో సంబంధం లేదు. పట్టుదల ఉండాలే కానీ ఏ వయసులో అయినా చదువుకోవచ్చు అనుకున్నది సాధించవచ్చు. అలా సాధించినవాళ్లు

దిశ, వెబ్ డెస్క్: చదువుకు వయసుతో సంబంధం లేదు. పట్టుదల ఉండాలే కానీ ఏ వయసులో అయినా చదువుకోవచ్చు అనుకున్నది సాధించవచ్చు. అలా సాధించినవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. తాను కూడా జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్న ఓ తల్లి తన కూతురుతో వెళ్లి నీట్ పరీక్ష రాసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన భూక్యా సరిత(37)కు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సమయంలోనే వివాహం జరిగింది.
ఆ తరవాత ఇద్దరు కూతుళ్లు జన్మించడంతో చదువును మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. కానీ ఆమె మనుసులో మాత్రం చదువుకోవాలనే కోరిక ఉంది. దీంతో నీట్ పరీక్షకు చదువుకుని ఆదివారం తన కూతురు కావేరీతో కలిసి నీట్ పరీక్ష రాసింది. ఇద్దరికీ వేరు వేరు పరీక్ష కేంద్రాలు ఇవ్వడంతో కావేరీ ఖమ్మంలోని పరీక్ష కేంద్రంలో, తల్లి సరిత నల్గొండలోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారు. మరి ఇద్దరిలో ఎవరికి సీటు వస్తుందో చూడాలి.






