NEET Exam... కన్నీళ్లతో అధికారుల కాళ్ళ మీద పడిన తల్లి.. కారణం ఇదే

by Muthe.Rajitha |   (  Updated:2025-05-04 12:09:13  IST  )

వైద్య కళాశాలల ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నేడు(ఆదివారం) నీట్ పరీక్ష(NEET Exam) జరిగిన సంగతి తెలిసిందే.

NEET Exam... కన్నీళ్లతో అధికారుల కాళ్ళ మీద పడిన తల్లి.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : వైద్య కళాశాలల ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నేడు(ఆదివారం) నీట్ పరీక్ష(NEET Exam) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలో అధికారులు కఠిన నిబంధనలు విధించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలవగా.. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్ చేశారు. ఈ విషయాన్ని హాల్ టికెట్లలో ముందుగానే పేర్కొన్నప్పటికీ.. పలువురు అభ్యర్థుల పట్ల ఈ నిబంధన శాపంగా మారింది. పరీక్షా కేంద్రాల వద్దకు పలువురు అభ్యర్థులు ఒకటీ రెండు నిముషాల ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. కాగా వారు అధికారులను ఎంతగా బతిమాలినప్పటీకి లోపలికి అనుమతించలేదు. ఇలాంటి ఘటన కరీంనగర్(Karimnagar) లో కూడా చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన ఓ విద్యార్థిని కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నీట్ పరీక్ష రాసేందుకు తల్లిని వెంటబెట్టుకొని చేరింది.

అయితే గేట్లు మూసిన 3 నిముషాల ఆలస్యంగా రావడంతో విద్యార్థిని లోపలికి అనుమతించలేదు. దీంతో తమ కూతురును లోపలికి అనుమతించాలని ఆమె తల్లి అధికారుల కాళ్ళవేళ్ళా పడటం చూసే వారిని కంటతడి పెట్టించింది. తన బంగారం అమ్మి కూతురికి కోచింగ్ ఇప్పించానని, తన ఒకే ఒక బిడ్డని డాక్టర్ ను చేయాలనేది తమ కల అని కంటతడి పెట్టుకుంది. దయచేసి లోపలికి అనుమతించాలని ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం రూల్స్ ప్రకారం తాము ఏమీ చేయలేమని లోపలికి అనుమతించలేదు.

Next Story