బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తా.. నీలం మధు సంచలన ప్రకటన

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-10 12:53:24  IST  )

బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముదిరాజ్‌కు కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధకరమని, ఇప్పటికైన సీఎం కేసీఆర్ పటాన్ చెరు స్థానంపై పునరాలోచించాలని బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ కోరారు.

బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తా.. నీలం మధు సంచలన ప్రకటన
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముదిరాజ్‌కు కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధకరమని, ఇప్పటికైన సీఎం కేసీఆర్ పటాన్ చెరు స్థానంపై పునరాలోచించాలని బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ కోరారు. పటాన్ చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ రాకపోతే తనకు అవకాశం ఇచ్చే ఇతర పార్టీలో చేరతానని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని చిట్కుల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇతర పార్టీ వాళ్లు తమ పార్టీలోకి రమ్మంటున్నారని తమకు ఆత్మగౌరవం ముఖ్యమని ఎమ్మెల్యే టిక్కెట్ ప్రకటిస్తేనే వస్తామని చెప్పానని వెల్లడించారు.

ఏ పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల బలం, అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని మధు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 16 నుంచి నియోజకవర్గంలోని కొత్తపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతానని, అదే రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 16వ తేదిలోపు ఏ పార్టీ అయినా వస్తే ఆలోచిస్తా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు. పాదయాత్రగా ప్రతి గడపకు వెళతానని, అందరి ఆశీర్వాదం తీసుకుని ప్రజల మద్దతుగా విజయం సాధిస్తానని మధు ధీమా వ్యక్తం చేశారు.

Next Story