- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడిగడ్డ బ్యారేజీపై NDSA రిపోర్టు.. నిర్మాణ సంస్థ L&T సంచలన లేఖ
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బ్యారేజీని నిర్మించిన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T) తాజాగా నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ (NDSA)కి సంచలన లేఖ రాసింది. అయితే, ఆ లేఖలో మేడిగడ్డ నివేదికను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీపై రిపోర్టును ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం చెందిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుదన్నారు. కానీ, గుడ్డిగా ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండానే బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేరని స్పష్టం చేశారు. గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదంటూ NDSA రిపోర్టులో పలుచోట్ల తెలిపిందని, అలాంటప్పుడు బ్యారేజీ ఫెయిల్ అంటూ రిపోర్డు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రిపోర్టులోని పేజీ నెం.283లో క్వాలిటీ కంట్రోల్ (Quality Control) విషయానికి సంబంధించి రిపోర్టును ఎల్ అండ్ టీ (L&T) సమర్పించిందని పేర్కొంటూనే.. పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించారని అనడం అసంబద్ధమని అన్నారు. బ్యారేజీ పునరుద్ధరణ గురించి ఇది వరకే ఒకసారి NDSAతో పాటు రాష్ట్ర నీటి పారుదుల శాఖకు లేఖలు రాశామని.. ఎలాంటి సాంకేతిక పరీక్షలు చేపట్టుకుండా బ్యారేజీలో వైఫల్యం ఉందని రిపోర్టు ఇవ్వడం సమంజసం కాదని ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖలో ప్రస్తావించింది.
కాగా, ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)పై నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ కీలక రిపోర్డును తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. అయితే, డీపీఆర్ (DPR)లో పేర్కొన్న ప్రాంతాలను పక్కన పెట్టి మరో చోట మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీలను నిర్మించారని అందులో పేర్కొన్నారు. కొత్త ప్రాంతాల్లో బ్యారేజీలు కట్టే ముందు కనీసం జియోలజికల్, జియో టెక్నికల్ టీమ్స్‌తో అక్కడ ఎలాంటి భూ పరీక్షలు నిర్వహించలేదని నివేదికలో వెల్లడించారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుందని.. అందుకే మేడిగడ్డ బ్యారేజీలో సాంకేతిక సమస్యలతో పాటు డ్యామేజ్ జరిగిందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగగా దానిని పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో సిఫారసు చేసింది.
అదేవిధంగా అన్నారం బ్యారేజీ (Annaram Barrage)ని డీపీఆర్ (DPR)లో పేర్కొన్న ప్రాంతంలో కాకుండా 2.2 కిలో మీటర్ల కిందకు నిర్మించారని తెలిపారు. నది ప్రవాహం అధికంగా ఉండటంతో అక్కడి నుంచి బ్యారేజీని మరోచోటికి షిఫ్ట్ చేశారని ప్రస్తావించారు. ఫలితంగా బ్యారేజీలో నీటి నిలువ సామార్ధ్యం 11.81 టీఎంసీల నుంచి 13.56 టీఎంసీలకు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా సుందిళ్ల బ్యారేజీ (Sundilla Barrage)ని కూడా 5.40 కిలో మీటర్ల కింద నిర్మించారని.. దీంతో బ్యారేజీ పొడవు ఒక మీటర్ తగ్గిందని తెలిపారు. నీటి నిలువ సామార్ధ్యం 3.27 టీఎంసీలకు పెరిగింది. డీపీఆర్‌లో ప్రకారం కాకుండా మరో చోట నిర్మాణాలు చేపట్టడం వల్లే ఆ రెండు బ్యారేజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది.






