NDA: సినీనటుడు బాలకృష్ణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సత్కారం

by Ramesh Goud |

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కలిశారు.

NDA: సినీనటుడు బాలకృష్ణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సత్కారం
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కలిశారు. బాలకృష్ణను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్ళిన కిషన్ రెడ్డి.. పద్మభూషన్ అవార్డ్(Padma Bhushan Award) ప్రకటన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను కిషన్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ సమాజానికి స్పూర్తిదాయక సినిమాలు తీస్తున్నానని, 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా, ప్రజా ప్రతినిథిగా చేస్తున్న సేవలను భారత ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని, క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా ఉంటూ.. నిరుపేదలకు సహాయం చేస్తున్నాడని అన్నారు. అంతేగాక మూడు ప్రజా ప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు సేవ చేసుకుంటున్నాడని, కేంద్ర ప్రభుత్వం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం సంతోషకరమని అన్నారు.

Next Story