మనుషులను చంపితే నక్సలిజం పోదు.. బండి సంజయ్‌కి మల్లు రవి కౌంటర్

by Kema Shiva Kumar |

మనుషులను చంపినంత మాత్రానా దేశంలో నక్సలిజం పోదని ఎంపీ మల్లు రవి (Mallu Ravi) అన్నారు.

మనుషులను చంపితే నక్సలిజం పోదు.. బండి సంజయ్‌కి మల్లు రవి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషులను చంపినంత మాత్రానా దేశంలో నక్సలిజం పోదని ఎంపీ మల్లు రవి (Mallu Ravi) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నక్సలైట్ల సానుభూతి పరుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy)‌ని ప్రోత్సహిస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నక్షలైట్లకు ఫిలాసఫీ ఉందని మాత్రమే రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలనే వాళ్ల ఆకాంక్ష అని మాత్రమే కామెంట్ చేశారని తెలిపారు. పేద ప్రజల పిల్లలకు ఆర్థికంగా, సామాజికంగా లాభం జరగాలనేదే తమ ప్రయత్నమని అన్నారు. ఇందులో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అన్నారు.

నక్సలైట్లకు ఫిలాసఫీ ఉంది కాబట్టే నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) వారితో చర్చలు జరిపాడని తెలిపారు. బీజేపీ (BJP)కి ధనవంతుల పార్టీ.. బిజినెస్ పార్టీ అనే పేరుందని అన్నారు. మనుషులను చంపినంత మాత్రానా నక్సలిజం పోదని విషయాన్ని బండి సంజయ్ గుర్తించాలని హితవు పలికారు. ముందు ఎక్స్ట్రిమిజానికి, నక్సలిజానికి తేడా ఎంటో తెలుసుకోవాలని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో సల్వాజుడుం వాళ్లు చంపుకునే వ్యవస్థను సుదర్శన్ రెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు. అది ప్రజల కోసం ఇచ్చిన స్టేట్‌మెంట్ అని అన్నారు. 14 సార్లు రివ్యూ చేసి అది పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అంటూ అందరూ ఒప్పుకున్నారని కొనియాడారు. ఇకనైనా బండి సంజయ్, అమిత్ షాలు రేవంత్ రెడ్డి, ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని విమర్శలు చేయడం మానుకోవాలి మల్లు రవి అన్నారు.

Next Story