రిగ్గింగ్ ఆరోపణలపై నవీన్ యాదవ్ స్పందన

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రిగ్గింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై నవీన్ యాదవ్(Naveen Yadav) స్పందించారు.

రిగ్గింగ్ ఆరోపణలపై నవీన్ యాదవ్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రిగ్గింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై నవీన్ యాదవ్(Naveen Yadav) స్పందించారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలుపును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారు. నిత్యం ప్రజల్లో్ ఉంటాను కాబట్టే ఆదరించారని అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయను అని మాటిచ్చారు. ఓటమి భయంతోనే రిగ్గింగ్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో నవీన్‌ యాదవ్‌ 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచే నుంచే నవీన్‌ యాదవ్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్‌ రౌండ్‌కూ అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ BRS అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

Next Story