MLA Naveen Yadav.... నెక్ట్స్ ఏంటి..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-14 11:45:29  IST  )

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలుపొందారు..

MLA Naveen Yadav....  నెక్ట్స్ ఏంటి..?
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. ఇన్నాళ్టికి ఆయన కల నెలవేరింది. గత మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఆయనను ఓటమిలే పలకరించాయి. అయితే కల మాత్రం అలానే ఉండిపోయింది. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 30 ఏళ్లకే ఏంట్రీ ఇచ్చారు. పలు పార్టీల్లో పోటీ చేశారు. తనకు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలంగాణకు తెలియజేశారు. కానీ ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. ఈసారి మంచి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్‌పై ఉన్న నమ్మకంతో జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు.


అయితే నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది తెలియాల్సి ఉంది. నవీన్ యాదవ్ సన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు. పీజేఆర్ శిష్యుడిగా శ్రీశైలం యాదవ్ అందరికి సుపరిచితుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఆయనకు చాలా పేరు ఉంది. అయితే ఆయన కుమారుడు నవీన్ యాదవ్ యూసుఫ్ గూడ ప్రాంతంలో పుట్టి పెరిగారు. నియోజకవర్గం ప్రజలతో కలిసి మెలిసి ఉంటారు. సమస్యలను అర్ధం చేసుకుని పరిష్కరించగలగే సత్తా ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తండ్రి రాజకీయంగా ఎదగలేకపోయినా తనలో ఆ కోరిక కొనసాగింది. తొలుత ఎంఐఎంలో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ రెండు సార్లు ఆయనకు ఓటములే ఎదురొచ్చాయి. కానీ వెనక్కి తగ్గలేదు. ఈసారి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగి పందెంకోడి మాదిరిగా భారీ గెలుపు సాధించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఘన విజయం సాధించారు.

అయితే ఇప్పుడు యువకుడిగా నవీన్ యాదవ్ జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తారో.. ప్రజల విశ్వాసాన్ని ఏ మేరకు నిలబట్టుకుంటారో చూడాల్సి ఉంది. కానీ రౌడీ కుమారుడు నవీన్ యాదవ్ అని, గెలిస్తే అరాచకాలే చేస్తారంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేశారు. ఆ ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టి జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఓ శక్తిగా మారాల్సిన అవసరం ఆయనకు తప్పనిసరిగా ఉంది. బీఆర్ఎస్ విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఆ వైపు అడుగులు వేయకుండా ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా తన సుపరిపాలన ఎలా ఉంటుందో జూబ్లీహిల్స్ ప్రజలకు చూపించాలి. అప్పుడే సక్సెస్ ఫుల్ పొలిటీషియన్‌గా భవిష్యత్తులోనూ కొనసాగుతారు. మరి నవీన్ మున్ముందు రాజకీయాలు, వ్యవహార శైలి ఎలా ఉండాలి.

Next Story