- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ యాదవ్‌కు మంచి భవిష్యత్తు ఉంది.. మంత్రి కొండా సురేఖ అభినందన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్, వెంకటగిరి ప్రాంతాల్లో తన కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకి మంచి మెజారిటీ తీసుకువచ్చినందుకు మంత్రి సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే, నవీన్ యాదవ్ ను ఘనంగా సత్కరించిన మంత్రి సురేఖ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ గెలుపుతో తాను ఎంతగానో సంతోషపడినట్టు సురేఖ ఆయనకు తెలిపారు. తనలాగే చిన్న వయస్సులోనే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారని.. మంచి భవిష్యత్ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అందుచేత, నవీన్ యాదవ్‌ను గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆయనకు సూచన చేశారు. అయితే, మంత్రి సురేఖ మంచి మాటలు, తనలో మరింత స్ఫూర్తి నింపాయని నవీన్ యాదవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.






