- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nature Camp: ట్రెక్ పార్క్‌లో నేచర్ క్యాంప్.. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ బంపర్ ఆఫర్
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ సంస్థ, బోటానికల్ గార్డెన్ ఇవాళ (శుక్రవారం) ఒక ప్రకటన విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (Telangana Forest Development Corporation) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ సంస్థ, బోటానికల్ గార్డెన్ ఇవాళ (శుక్రవారం) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు (శనివారం) ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9:30 గంటల వరకు నేచర్ క్యాంప్ (Nature Camp) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, రాత్రిపూట అడవిలో నడక, నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయని, పాల్గొన్న వారికి సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తారని పేర్కొంది.
అలాగే (Botanical Garden) బోటానికల్ గార్డెన్‌లో ఆదివారం 15-06-2025న, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు "బోటానికల్ గార్డెన్‌లో బర్డ్ వాక్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి పిల్లలు పెద్దలు అందరూ ఆహ్వానితులేనని స్పష్టం చేసింది. పాల్గొనే వారు పక్షుల జాతులను గుర్తించడం, పక్షులు ఏ రకమైన వాతావరణంలో మరియు ఏ రకమైన వృక్షాలలో గూళ్ళు కడతాయి అనేది తెలుసుకోవచ్చు, పక్షుల ఆహారపు అలవాట్ల గురించి, పక్షులు ఎలా కదులుతాయి, ఎగురుతాయి, వాటి సామాజిక ప్రవర్తనలు ఎలా ఉంటాయో మా నిపుణులు, నేచురలిస్ట్‌లు వచ్చిన వారికి పక్షులను చూపిస్తూ క్షుణ్ణంగా వివరిస్తారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకో టూరిజం రంజిత్ నాయక్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే వారు టికెట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం 98852 98980, 94935 49399 నెంబర్‌లను సంప్రదించాలని వారు కోరారు.






