9న విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె.. స్పష్టం చేసిన టీజీ పీఈ జేఏసీ

by Ajay Maddhiboyina |

విద్యుత్​ ఉద్యోగులను ప్రైవేటీకరించే పాలకుల చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీ పీఈ జేఏసీ ) స్పష్టం చేసింది.

9న విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె.. స్పష్టం చేసిన టీజీ పీఈ జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్​ ఉద్యోగులను ప్రైవేటీకరించే పాలకుల చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీ పీఈ జేఏసీ ) స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించింది. గురువారం ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్ర విద్యుత్ జేఏసీల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​ఎస్​వీకే కేంద్రంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్​ ప్రైవేటీకరణ వల్ల పేద వినియోగదారులపై కలిగే దుష్ప్రభావాన్ని , ఆర్థికంగా వెనుకబడిన వారిపై పడే దుష్ప్రభావాన్ని చర్చించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని తెలంగాణ స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు లు అన్నారు.

ఉత్తర ప్రదేశ్ పవర్​డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే దేశవాప్త సమ్మె కు వెళ్లేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. అటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని, యూపీతో పాటు ఇతర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైనా ఈ ప్రక్రియను వేగవంతం చేయమని ఒత్తిడి చేస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికే చండీగఢ్ లో ప్రైవేటీకరించారని, అక్కడి నుండి యూపీ దిశగా అడుగులు వేస్తుండడాన్ని నివారించక పోతే ఇక దేశం మొత్తం ప్రైవేటు అంశం వేగవంతం అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. తద్వారా స్మార్ట్ మీటరింగ్, అవుట్‌సోర్సింగ్ వంటి అనేక పద్ధతులలో ప్రత్యక్ష ప్రైవేటీకరణ వేగవంతం అవుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ రంగం కూడా సంక్షోభంలోనే ఉందని, ఇందుకు కారణం ఇతర రాష్ట్రాల మార్కెట్ నుండి భారీ రేటుకు అధిక మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేస్తున్న విషయం గుర్తు చేస్తున్నామన్నారు. విద్యుత్​ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోక పోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ఈ క్రమంలో యూపీ విద్యుత్​ ఉద్యోగులు ఏడు నెలలగా నిరవధిక ధర్నాలతో పోరాడుతున్నారన్నారు. వారికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు సహకరిస్తుందుకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్​నేతలు మోహన్ శర్మ, పాట్రన్ అశోక్ రావు , శ్రీధర్, బీసీ రెడ్డి , అనిల్ కుమార్, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Next Story