- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SC Commission: మెడికో ప్రీతి కేసు.. రంగంలోకి జాతీయ ఎస్సీ కమిషన్
సంచలనం సృష్టిస్తున్న వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన కేసులో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టిస్తున్న వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన కేసులో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందించాలని వరంగల్ కమిషనర్ ను ఆదేశించింది. ఇందిరా శోభన్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, తీసుకున్న చర్యలు, ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరాలు సమర్పించాలని నోటీస్ ఇచ్చింది.
వరంగల్ పోలీసులకు జాతీయ ఎస్సీ కమిషన్ సమాచారం కోరిన నేపథ్యంలో ఇందిరా శోభన్ రియాక్ట్ అయ్యారు. వరంగల్ సీపీ రంగనాథ్ సిన్సియర్ గా పని చేస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ ఘటనలో లవ్ జీహాద్ కోణం ఉందని కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు కేసులో అసలు నిజాలను పక్కదారి పట్టిస్తాయని అన్నారు. ఇలాంటి టైమ్ లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.






